- Advertisement -
కౌలాలంపూర్ : మలేషియా ఓపెన్‌లో పి.వి సింధు క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్‌లో తొమొక మియజాకిపై 21-8, 21-13తో గెలుపొందిన సింధు ముందంజ వేసింది. పురుషుల డబుల్స్‌లో సాత్విక్, చిరాగ్ శెట్టి జోడీ 21-18, 21-11తో మలేషియా జోడీ అరిఫ్, కింగ్‌లపై వరుస గేముల్లో గెలుపొంది క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ 20-22, 15-21తో.. ఆయుశ్ శెట్టి 18-21, 21-18, 12-21తో పరాజయం పాలయ్యారు.
- Advertisement -



