– ఉన్నతి హుడా చేతిలో ఓటమి
– చైనా ఓపెన్ సూపర్ సిరీస్
బీజింగ్ (చైనా) : భారత అగ్రశ్రేణి షట్లర్, రెండుసార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధు పోరాటానికి చైనా ఓపెన్‌లో తెరపడింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో వరల్డ్ నం.6పై మెరుపు విజయంతో ఫామ్‌లోకి వచ్చిన సింధు.. రెండో రౌండ్లో సహచర యువ షట్లర్ ఉన్నతి హుడా చేతిలో పరాజయం పాలైంది. మూడు గేముల మ్యాచ్‌లో 21-16, 19-21, 21-13తో సింధుపై ఉన్నతి విజయం సాధించింది. సుమారు 75 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింధుపై ఉన్నతి పైచేయి సాధించింది. తొలి గేమ్‌లో 13-13 తర్వాత వరుస పాయింట్లు సాధించిన ఉన్నతి ఆధిక్యం నిలుపుకుంది. రెండో గేమ్‌లో 19-19 వద్ద ఉన్నతిని నిలువరించిన సింధు.. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లింది. కానీ డిసైడర్‌లో యువ షట్లర్ ఆధిపత్యం చూపించింది. డీలాపడిన సింధు.. ఉన్నతికి కనీస పోటీ ఇవ్వలేకపోయింది. పురుషుల సింగిల్స్‌లో హెచ్.ఎస్ ప్రణరు సైతం ఓటమి చెందాడు. తొలి రౌండ్లో గొప్పగా రాణించిన ప్రణరు.. ఆరో సీడ్ చో చెన్ (చైనీస్ తైపీ) చేతిలో 21-18, 15-21, 8-21తో చేతులెత్తేశాడు. పురుషుల డబుల్స్‌లో స్టార్ జోడీ సాత్విక్-చిరాగ్ రెండో రౌండ్లో అలవోక విజయం సాధించారు. ఎనిమిదో సీడ్ లియో, బగాస్‌పై 21-19, 21-19తో వరుస గేముల్లో గెలుపొందారు.
సింధుకు చుక్కెదురు
- Advertisement -
- Advertisement -