నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
నారాయణ విద్యా సంస్థల గ్రూప్ డైరెక్టర్, డాక్టర్ సింధూర నారాయణ దుబారులో సౌత్ ఇండియా బిజినెస్ (ఎస్‌ఐబీఏ-2025) అవార్డ్స్ ఆదివారం అందుకున్నారు. విద్యారంగంలో ఆమె అసాధారణ కృషి చేయడంతోపాటు సమర్థ నాయకత్వానికిగానూ ప్రతిష్టాత్మక అవార్డ్సు దక్కించున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి వేర్వేరు రంగాల్లో రాణిస్తున్న ప్రభావశీల వ్యక్తులను ఈ పురస్కారానికి ఎంపిక చేస్తారు. ఆసియాలోనే అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటిగా నారాయణ ఎదిగిందని నిర్వాహకులు ప్రశంసించారు. విద్యార్థులు, తల్లిదండ్రుల ప్రయోజనాలను కాపాడటంలో ముందుంటూ విద్యారంగంలో విశ్వసనీయతకు చిరునామాగా నారాయణను నిలపటంలో ఆమె కృషిని కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వివేక్ వెంటకస్వామి, సినీ తారలు శ్రియాశరణ్, మంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐబీఏ అవార్డు అందుకున్నసింధూర నారాయణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES