Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంపీఎన్‌బీతో సింగరేణి ప్రమాదబీమా ఒప్పందం

పీఎన్‌బీతో సింగరేణి ప్రమాదబీమా ఒప్పందం

- Advertisement -

– పరిహారం రూ.1 కోటి 25 లక్షలు
– సాధారణ మరణానికి రూ.10 లక్షల టర్మ్‌ పాలసీ
– పొరుగు సేవల ఉద్యోగులకు రూ.40 లక్షల ప్రమాదబీమా
– జీతం ఖాతాకు అనుసంధానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

సింగరేణి కాలరీస్‌ సంస్థ తమ ఉద్యోగులకోసం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ)తో రూ.1 కోటి 25 లక్షల ప్రమాద బీమా ఒప్పందం చేసుకుంది. బుధవారంనాడిక్కడి సింగరేణి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆ సంస్థ సీఎమ్‌డీ ఎన్‌ బలరాం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ సీఈఓ అండ్‌ ఎమ్‌డీ అశోక్‌చంద్రతో ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కార్మికులు మృతి చెందినప్పుడు కంపెనీ ఇస్తున్న సహాయం కొంత ఉన్నప్పటికీ, వారి కుటుంబాలకు మరింత ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో బ్యాంకులతో మాట్లాడి ఈ తరహా ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అలాగే సింగరేణి కార్మికులకు సాధారణ మరణం సంభవించినా, వారికి రూ.10 లక్షల టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను కూడా పీఎన్‌బీ అమలు చేస్తున్నదని వివరించారు. సింగరేణి పొరుగు సేవల ఉద్యోగుల కోసం రూ.40 లక్షల ప్రమాద బీమా ఒప్పందాన్ని కూడా అమలు చేస్తున్నదని వివరించారు. సింగరేణి సంస్థ వ్యాపార విస్తరణ చర్యలు చేపడుతున్నదనీ, సోలార్‌ విద్యుత్తు, గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ ఎలక్ట్రిసిటీ తదితర రంగాల్లోకి ప్రవేశిస్తుందని చెప్పారు. పీఎన్‌బీ సీఈవో అండ్‌ ఎమ్‌డీ అశోక్‌చంద్ర మాట్లాడుతూ సింగరేణితో తాము కుదుర్చుకున్న ఒప్పందం ఇతర సంస్థలకు కూడా ఆదర్శప్రాయంగా ఉంటుదన్నారు. ఈ తరహా ఒప్పందాలను ఇతర శాఖలకు కూడా విస్తరిస్తామన్నారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్‌ ఆపరేషన్‌ ఎల్వీ సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కోల్‌ మూమెంట్‌ ఎస్డీఎమ్‌ సుభాని, జనరల్‌ మేనేజర్‌ మార్కెటింగ్‌ ఎన్వీ రాజశేఖర్‌రావు, పీఎన్‌బీ హైదరాబాద్‌ రీజినల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ సునీల్‌కుమార్‌ చుగ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad