Saturday, September 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు పెంచాలి

సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మికుల వేతనాలు పెంచాలి

- Advertisement -

లాభాలవాటా రూ.20 వేలు చెల్లించాలి
ఉప ముఖ్యమంత్రి భట్టికి సింగరేణి కాంటాక్ట్‌ కార్మికుల జేఏసీ విజ్ఞప్తి
సమస్యల పరిష్కారానికి హామీ


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సింగరేణి కార్మికుల వేతనాలు పెంచాలనీ, లాభాల వాటాలో రూ. 20వేలు చెల్లించాలని సింగరేణి కాంట్రాక్ట్‌ కార్మిక సంఘాల జేఏసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అలాగే పెండింగ్‌ లో ఉన్న ఇతర అన్ని సమస్యలు పరిష్కరించాలని కోరారు.తమ డిమాండ్ల సాదన కోసం సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలనుండి వందలాదిమంది కాంట్రాక్ట్‌ కార్మికులు ప్రజాభవన్‌కు తరలి వచ్చారు. కార్మికులకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి , గుమ్మడి నరసయ్య ప్రజావాణి ఇన్‌చార్జి, మాజీ మంత్రి చిన్నారెడ్డితో కలిసి కాంటాక్ట్‌ కార్మికుల ప్రతినిధులను భట్టి దగ్గరకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆయన వారి సమస్యలపై చర్చించారు. సింగరేణిలో కాంటాక్ట్‌ కార్మికుల శ్రమతోనే లాభాలు వస్తున్నాయని అలాంటి కార్మికుల సమస్యల పరిష్కారంలో సింగరేణి యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని జేఏసీ నేతలు తెలిపారు. కోల్‌ ఇండియాలో కాంట్రాక్ట్‌ కార్మికులకు రోజుకు రూ.1,285 మాత్రమే చెల్లిస్తుంటే, సింగరేణిలో కేవలం రూ541 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కొక్క కాంట్రాక్ట్‌ కార్మికుడు రోజుకు రూ.744, నెలకు రూ.19 344 నష్టపోతున్నారని పేర్కొన్నారు.

పరిష్కారానికి ఉపముఖ్యమంత్రి హామీ
స్పందించిన ఉపముఖ్య మంత్రి సింగరేణిలో కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు హమీ ఇచ్చారు. వేతనాలు, లాభాల వాటా పెంచెందుకు కషి చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -