Friday, August 1, 2025
E-PAPER
Homeకరీంనగర్ఆర్జి-3 లో పర్యటించిన సింగరేణి ఫారెస్ట్రీ అడ్వైజర్

ఆర్జి-3 లో పర్యటించిన సింగరేణి ఫారెస్ట్రీ అడ్వైజర్

- Advertisement -

నవతెలంగాణ – రామగిరి 
రామగుండం-3 ఏరియాలోని ఓసిపి-1, 2 ఉపరితల గను లను మంగళవారం సింగరేణి ఫారెస్ట్రీ అడ్వైజర్ ఎం.సి.ఫర్గెయిన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఓసిపి-2 ఉపరితల గని పరిధిలోని ఓ.బి.డంపు పై ఉన్న 65 హెక్టార్ల భూమిని ప్రభుత్వ అటవీ శాఖకు అప్పగించడానికి చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఓసియం-1ఉపరితల గని ఓ.బి.డంప్ పై నాటిన మొక్కలను పరిశీలించారు.ఈ సందర్భంగా రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు వారికి వివరాలు తెలియజేశారు.

వారితోపాటు డీ.ఎఫ్.ఓ.శివయ్య, ప్రాజెక్ట్ ఆఫీసర్లు సి.హెచ్.వెంకటరమణ, జె.రాజశేఖర్, ఫారెస్ట్ అధికారి బి. కర్ణ, ఎస్టేట్స్ విభాగాధిపతి కె.ఐలయ్య, సర్వే విభాగాధిపతి డి.జనార్ధన రెడ్డి, ఎఫ్.ఆర్.ఓ. రమేష్, పర్యావరణ అధికారులు కిషన్, టి. నాగేశ్వర రావు, జూనియర్ ఫారెస్ట్ అధికారి మేఘన తోపాటు ఇతర అధికారులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -