Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంపెద్దిపల్లి గ్రామంలో సింగరేణి ఉచిత వైద్య శిబిరం

పెద్దిపల్లి గ్రామంలో సింగరేణి ఉచిత వైద్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – మణుగూరు
సింగరేణి సేవ సమితి మరియు సింగరేణి వైద్య, ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో మణుగూరు మండల రామానుజవరం గ్రామ పంచాయితీ పరిధిలోని పెద్దిపల్లి గ్రామంలో బుధవారం  సింగరేణి ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడినది . ఈ సంధర్భంగా డిజిఎం పర్సనల్ ఎస్. రమేశ్  మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం తమ వంతు సామాజిక బాధ్యతగా బొగ్గు గనుల పరిసర ప్రాంతాల గ్రామస్తులకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో భాగంగా పెద్దిపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది.

ఈ వైద్య శిబిరంలో స్త్రీ, పురుషులు, వృద్ధులు, విద్యార్థిని విద్యార్ధులు అధిక సంఖ్యలో విచ్చేసి మొత్తం 54 మందికి ఉచితంగా వైద్య సేవలు అందించటం జరిగింది. ఈ వైద్య శిబిరంలో సాధారణ వ్యాధులకు ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు బీపీ, షుగర్ వ్యాదిగ్రస్తులను పరీక్షించి వారికి కూడా వ్యాధి నియంత్రణ మందులు ఇవ్వడం జరిగింది. మణుగూరు ఏరియా పరిసర ప్రాంత గ్రామస్తులకు అందిస్తున్న ఉచిత వైద్య శిభిరాలను మరింతగా విస్తృత పర్చడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రబల్లుతున్న సీజనల్ వ్యాధుల బారిన పడకుండా పాటించవలసిన పరిసరాల, గృహ మరియు వ్యక్తిగత పరిశుభ్రత తప్పక పాటించవలసిన ఆవశ్యకత పై సింగరేణి వైద్యులు ఇన్నయ్య  గ్రామస్తులకు అవగాహన కలిపించడం జరిగిందని డిజిఎం పర్సనల్ ఎస్ రమేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డా. ఇన్నయ్య , ఏరియా హాస్పిటల్ స్టాఫ్ నర్స్ ఆర్ అనంత లక్ష్మి, సేవ కో ఆర్డినేటర్  కె. వీ. మారేశ్వర రావు, ఏరియా హాస్పిటల్ సిబ్బంది  రవి, ఆయా రామ,శ్రవణ్ కుమార్, పెద్దిపల్లి గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad