- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణ ఏర్పాటులో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని సీఎం రేవంత్ అన్నారు. ‘సింగరేణి బొగ్గు గనులు దేశానికి వెలుగులు అందిస్తున్నాయి. సంస్థకు వచ్చే లాభాలను కార్మికులకు పంచుతున్నాం. దేశంలోనే తొలిసారిగా ఒప్పంద కార్మికులకు కూడా గతేడాది రూ.5 వేల బోనస్ ఇచ్చాం. ఈసారి ఆ మొత్తాన్ని పెంచి రూ.5,500 ఇస్తున్నాం. ప్రైవేట్‌కు అప్పగించిన గనుల టెండర్లను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని స్పష్టం చేశారు.
- Advertisement -