Saturday, March 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసింగరేణి ఓసీ త్రీ పనుల అడ్డగింత

సింగరేణి ఓసీ త్రీ పనుల అడ్డగింత

- Advertisement -

కేటీపీపీలో నిలిచిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి
నవతెలంగాణ-గణపురం

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని సింగరేణి ఓసీ త్రీ పనులను శుక్రవారం వెంకటేశ్వర్లపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఓసీ త్రీ గని వల్ల తమ పంటలు నాశనం అవుతున్నాయని, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, బాంబు బ్లాస్టింగ్‌లతో తమ ఇండ్లు పగుళ్లు పడుతూ నేలమట్టమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వేసవి కాలం కావడంతో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

సింగరేణి అధికారులు వెంకటేశ్వర్లపల్లి గ్రామాన్ని తీసుకున్నామని చెప్పి ఇప్పటివరకు గ్రామానికి చేసిందేమీ లేదన్నారు. గ్రామంలో ముందుగా పంట పొలాలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారని, గ్రామంలోని ఇండ్లు, పంట పొలాలు ఒకేసారి తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం చేసే వరకు ఈ ఆందోళన కొనసాగి స్తామని భీష్మించి కూర్చున్నారు. దాంతో సింగరేణి అధికారులు వచ్చి గ్రామస్తులతో చర్చలు జరిపి ధర్నాను విరమింపచేశారు.

కేటీపీపీలో నిలిచిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి
మండలంలోని చెల్పూర్‌ కాకతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మొదటి విడత 500 మెగావాట్ల ప్లాంట్‌లో శుక్రవారం విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. సాంకేతిక లోపం, బాయిలర్‌ ట్యూబ్‌లు లీకేజీ కావడంతో ఉత్పత్తి నిలిచిపోయినట్టు తెలిసింది. కాగా ఉత్పత్తిని పున: ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -