Sunday, August 24, 2025
E-PAPER
spot_img
Homeరాష్ట్రీయంగని ప్రమాదంలో సింగరేణి కార్మికుడి మృతి

గని ప్రమాదంలో సింగరేణి కార్మికుడి మృతి

- Advertisement -

అకస్మాత్తుగా కూలిన సైడ్‌ వాల్‌
నవతెలంగాణ-మందమర్రి

మంచిర్యాల జిల్లా మందమర్రి కెకె-5 గని ప్రమాదంలో ఓ కార్మికుడు మృతిచెందాడు. శుక్రవారం 2వ షిఫ్ట్‌లో ఎస్‌డీఎల్‌ యంత్రాన్ని పరిశీలిస్తుండగా 20డీప్‌ 32 అప్‌ లెవెల్‌ వద్ద అకస్మాత్తుగా సైడ్‌ వాల్‌ కూలింది. ఈ ఘటనలో ఆర్కేపీకి చెందిన శ్రావణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కార్మికులు, అధికారులు వెంటనే కెకె1 డిస్పెన్సరీకి, అక్కడ నుంచి రామకృష్ణాపూర్‌ సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌ తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో రాత్రి 9గంటలకు శ్రావణ్‌ (32) మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి శనివారం ఏరియా ఆస్పత్రికి వచ్చి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. తక్షణ పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, భద్రతా ప్రమాణాలపై విచారణ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్మికుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సాంకేతిక, భద్రతాపరంగా తగిన సంస్కరణలు తీసుకురావాలని సింగరేణి ఉన్నతాధికారులను ఆదేశించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad