ముంబయి బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చికిత్స
ముంబయి : బాలీవుడ్ లెజెండరీ సింగర్ ఆశా భోస్లే అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. శనివారం ఆమెకు గుండెపోటు రావడంతో ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేర్చినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆశా భోస్లే వయసు 92 ఏండ్లు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు ధ్రువీకరించాల్సి ఉన్నది. తన గాత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆశా భోస్లే, బప్పి లహరి, ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ వంటి ఎంతో మంది లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్లతో పని చేశారు. స్వాతంత్య్రానికి ముందు సాంగ్లీ రాష్ట్రంలో పుట్టిన ఆశా భోస్లే, 2000వ ఏడాదిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. అత్యధిక పాటలు పాడిన ఫీమేల్ సింగర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం దక్కించుకున్నారు. ఆశా భోస్లే. హిందీ, మరాఠీ, తమిళ్, తెలుగు, బెంగాలీ, మలయాళం, కన్నడ, గుజరాతీ, ఒడియా.. ఇలా దాదాపు 20 భాషల్లో ఆశాభోస్లే పాటలు పాడారు.



