- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ గాయకుడు, మ్యూజిక్ కంపోజర్ సచిన్ సంఘ్వీని లైంగిక వేధింపుల కేసులో అదుపులోకి తీసుకున్నారు. మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం కల్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ మహిళను మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయిన తనను మ్యూజిక్ స్టూడియోకు ఆహ్వానించి, లైంగికంగా దాడి చేసినట్లు మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ ఆరోపణలను సచిన్ లాయర్ ఖండించారు. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
- Advertisement -



