- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కర్నాటక హైకోర్టులో సింగర్ సోనూ నిగమ్ కి ఊరట దక్కింది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది. విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని గాయకుడికి సూచించింది. భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారన్న ఆరోపణలతో తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ సోనూ న్యాయస్థానాన్ని ఇటీవల ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
- Advertisement -