నవతెలంగాణ-జన్నారం
వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జన్నారం మండలంలోని ఇంధన్ పల్లి అటవీ రేంజ్ కార్యాలయంలో వందేమాతర గీతాలపన చేశారు. ఎస్ఆర్ఎ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దేశభక్తిని కలిగి ఉండాలన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానీయులను స్మరించుకోవాలన్నారు. ఎఫ్ ఎస్ ఓ ఎఫ్ బి ఓ అటవీ అధికారులు పాల్గొన్నారు.జన్నారం లో బంకిమ్ చంద్ర చటర్జీ రచించిన వందేమాతరం గీతం 150 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జన్నారం మండలంలోని స్లేట్ హై స్కూల్, స్లేట్ ఎక్స్లెన్స్ స్కూల్ స్థానిక పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో జన్నారం మండలంలో ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద విద్యార్థులు అందరూ ర్యాలీగా వెళ్లి వందేమాతరం గీతం ఆలపించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష మాట్లాడుతూ మన భారత జాతీయ గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భం ప్రతి భారతీయుడికీ గర్వకారణం అన్నారు. ఈ త్రివర్ణ పతాకం మన దేశ ఐక్యత, త్యాగం, శాంతి, ధైర్యం, గౌరవానికి ప్రతీక అని మన దేశ వీరులు రక్తం చిందించి సాధించిన స్వాతంత్ర్యానికి ఇది గుర్తుఅన్నారు. ప్రతి పౌరుడు ఈ పతాకానికి గౌరవం ఇవ్వడం, దాని విలువను గుర్తించడం మన బాధ్యత. 150 సంవత్సరాల ఈ మహత్తర ప్రయాణం మన దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్యం, జాతీయ ఐక్యతకు ప్రతిబింబం అని తెలియజేశారు. విద్యార్థిని, విద్యార్థులు అందరితో కలిసి వందేమాతర గీతం ఆలపించడం జరిగింది..ఈ కార్యక్రమంలో స్లేట్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు ప్రిన్సిపాల్స్ షిరీన్ ఖాన్, శ్రీదేవి ఉపాధ్యాయులు కృష్ణ, నాగరాజు, కిరణ్, పి.ఈ.టి సంతోష్, నగేష్ స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది అలాగే మండలంలోని తాసిల్దార్ ఎంపీడీవో తదితర ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఆయా కార్యాలయాల సిబ్బంది వందేమాతరం గీతాన్ని ఆలపించారు..
ఇందన్ పల్లి రేంజ్ కార్యాలయం లో వందేమాతర గీతాలాపన
- Advertisement -
- Advertisement -



