- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; తెలుగు రాష్ట్రాల్లో మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, తెలంగాణలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఈ ఆదేశాలు వర్తిస్తాయి. పాఠశాలలు ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి పిల్లలను ఇంటికి పంపించనున్నారు.
- Advertisement -



