Saturday, May 17, 2025
Homeసినిమా'#సింగిల్‌'బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌

‘#సింగిల్‌’బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌

- Advertisement -

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా హీరో, హీరోయిన్లుగా, వెన్నెల కిషోర్‌ కీలక పాత్ర పోషించిన చిత్రం గీతా ఆర్ట్స్‌ సమ్మర్‌ సెన్సేషనల్‌ బ్లాక్‌ బస్టర్‌ ‘#సింగిల్‌’. కార్తీక్‌ రాజు దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్‌ చౌదరి నిర్మించారు. ఈనెల 9న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అందరినీ అలరించి సమ్మర్‌ బ్లాక్‌బస్టర్‌ విజయంతో సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌మీట్‌లో ప్రొడ్యూసర్‌ అల్లు అరవింద్‌ మాట్లాడుతూ,’ఈ సినిమా రషెస్‌ చూసిన తర్వాత శ్రీవిష్ణుని పిలిచి గీతాఆర్ట్స్‌లో మరో రెండు సినిమాలు చేయాలని చెక్‌ ఇచ్చాను. మనిషిగా, యాక్టర్‌గా తను అంత నచ్చాడు. సినిమా బాగుంటే మేము థియేటర్స్‌కి వస్తాము అని నిరూపించిన ప్రేక్షకులు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. డైరెక్టర్‌ కార్తీక్‌ రాజు అద్భుతంగా ఈ సినిమాని తీశారు. వెన్నెల కిషోర్‌ ఈ సినిమాతో కొంచెం దగ్గర అయ్యారు. కేతిక, ఇవాన ఫెంటాస్టిక్‌గా పెర్ఫామ్‌ చేశారు. విశాల్‌ చంద్రశేఖర్‌ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారు. విద్య ఈ సినిమాతో విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ సమ్మర్‌లో థియేటర్స్‌కి వచ్చి అద్భుతంగా ఎంజారు చేస్తున్న ఆడియన్స్‌ అందరికీ థ్యాంక్స్‌’ అని అన్నారు. ‘మూడేళ్ల క్రితం ఈ కథని డైరెక్టర్‌ కార్తీక్‌ రాజు చెప్పారు. మంచి టీంతో చేస్తున్న ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్‌ కొడితే బావుంటుందని అనుకున్నాను అది జరిగింది. ఇది విద్యా కోసమైనా సక్సెస్‌ అయిపోవాలని బలంగా అను కున్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చిన ఆడియన్స్‌కి థ్యాంక్స్‌’ అని హీరో శ్రీ విష్ణు చెప్పారు.
వెన్నెల కిషోర్‌ మాట్లాడుతూ,’డైరెక్టర్‌ కార్తీక్‌ వెరీ జెన్యూన్‌ పర్సన్‌. సినిమాని చాలా హానెస్ట్‌గా తీశారు. శ్రీ విష్ణుతో జర్నీ మర్చిపోలేను. ఈ సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఇందులో సెకండ్‌ హీరో మీరే అని చెప్పారు. ఆయన లాంటి వ్యక్తి చాలా అరుదు. ఆయన లేకపోతే అరవింద్‌ క్యారెక్టర్‌కి ఇంత మంచి ఎలివేషన్‌ రాదు. ఆయనతో మరిన్ని సినిమాల్లో పనిచేయాలని ఉంది’ అని తెలిపారు. ‘అల్లు అరవింద్‌, నిర్మాతలకు ధన్యవాదాలు. శ్రీ విష్ణుకి మూడేళ్ల క్రితం కథ చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటివరకు చాలా సపోర్ట్‌ చేశారు. కిషోర్‌కి నేను బిగ్‌ ఫ్యాన్‌ని. ఆయన్ను ఊహించే ఆ క్యారెక్టర్‌ రాసుకున్నాను. ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాని నా జీవితాంతం మర్చిపోలేను’ అని డైరెక్టర్‌ కార్తీక్‌ రాజు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -