నవతెలంగాణ మద్నూర్
దుర్గ మాతా దేవి వ్యవసాయ పంటలు బాగా పండే విధంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఆశీర్వదించండి అంటూ మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ దంపతులు పూజ హారతి కార్యక్రమంలో ఆ దుర్గామాత దేవిని కోరుకున్నట్టు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాలు దసరా రోజుతో ముగియడంతో మద్దూరు మండల కేంద్రంలో దుర్గామాత విగ్రహాన్ని మండల కేంద్రంలో ఊరేగింపు ఉత్సవాలు జరిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సంతోషి మాత ఆలయం వద్ద గురువారం ఉదయం చైర్మన్ శ్రీనివాస్ పటేల్ దంపతులైన పెద్ద ఎక్లారా గ్రామ తాజా మాజీ సర్పంచ్ హరికాపాటిల్ వారి కుటుంబ సభ్యులు అంతా కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గామాత దేవిని వారు కోరుకుంటూ ప్రజలందరికీ సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఆశీర్వదించాలని కోరుకున్నట్టు తెలిపారు.