ఆది సాయికుమార్ హీరోగా త్రిశూల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రశాంత్ జి. రుద్రప్ప నిర్మిస్తున్న చిత్రానికి ‘ఆది రుద్ర’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి నవరసన్ కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్‌ను ప్రకటిస్తూ ఆకట్టుకునే పోస్టర్‌ను విడుదల చేశారు.
టైటిల్ పోస్టర్‌లో ఆది సాయికుమార్ త్రిశూలం పట్టుకుని, వెనక్కి తిరిగి నిలబడిన తీరు ఆకట్టుకుంటోంది. మనిషికి, అతీంద్రియ ప్రపంచం నేపథ్యంలో ఈ కథ సాగనుందనే ఆసక్తిని ఈ విజువల్స్ కలిగిస్తున్నాయి. 1960ల నుంచి 1990ల మధ్య కాలంలో జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ ప్రత్యేకమైన పీరియడ్ నేపథ్యం సినిమాలోని పాత్రలు, విజువల్ స్టైల్, ఆ కాలం నాటి వాతావరణాన్ని మళ్లీ సృష్టిస్తూ, ఆసక్తికరమైన దైవిక రహస్యాన్ని మిళితం చేసి ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలనేది మేకర్స్ లక్ష్యం. దైవత్వం, విశ్వాసం, ఆధ్యాత్మికత, అంతు చిక్కని రహస్యాల చుట్టూ సాగే ‘ఆది రుద్ర’ భావోద్వేగాలు ఉత్కంఠభరితమైన సన్నివేశాలు, ఆకట్టుకునే థియేట్రికల్ ప్రజెంటేషన్‌తో ప్రేక్షకులకు మరపురాని సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది.
ఈ సినిమా షూటింగ్‌ను జనవరిలో ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.






కామెంట్‌లు (0)