భార్గవ్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’. ఆరియా మీనన్ కథానాయిక. తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై బండి నాగరాజు నిర్మిస్తుండగా, మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 70 శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. దసరా పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ సినిమా పోస్టర్ లాంచ్ జరిగింది.
ప్రొడ్యూసర్ బండి నాగరాజు మాట్లాడుతూ, ‘మంచి క్వాలిటీతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నాం. ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. యూత్ తో పాటు ఫ్యామిలీ ఎంజాయ్ చేయవచ్చు. డిసెంబర్ లో మా సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు.
‘ఇది ఒక మంచి యూత్ ఫుల్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్. మూవీ క్వాలిటీ, ఔట్ పుట్ తో సంతృప్తిగా ఉన్నాం. ఈ సినిమాతో దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని డైరెక్టర్, హీరో భార్గవ్ చెప్పారు.






కామెంట్‌లు (0)