Magazines

అంచనాలు పెరుగుతున్నాయ్‌..

54 నిమిషాల క్రితం

Expectations are rising..
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం


హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. ఈ సినిమా ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, వినోదం, హాస్యం, యాక్షన్‌తో అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా ఈ చిత్రం సిద్ధమవుతోంది.

దీపావళి పండుగకు ముందు థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు పండుగ వినోదాన్ని అందించ నుంది అని మేకర్స్‌ తెలిపారు.

దాదాపు 20 ఏళ్ల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు, టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. మధ్యతరగతి కుటుంబ జీవితంలోని సహజ మైన సంఘటనలు, కుటుంబ సభ్యుల మధ్య అను బంధాలు, చమత్కారమైన సంభాషణలు, హాస్యం, భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా ఈ చిత్రం ఉండబోతోందనే సంకేతాలను టీజర్ అందించింది. కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథాంశంతో, అన్ని తరాల వారినీ ఆకట్టుకునే సంపూర్ణ వినోదాత్మక చిత్రంగా రూపొందుతోంది. వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు.

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మమత సమర్పిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్