Magazines

ప్రేక్షకులు గర్వంగా చెప్పుకునే సినిమా

2 గంటల క్రితం

film
avatar
balaji

ప్రచురించబడింది నవం 18, 2026 | 2 నిమిషాల చదవడం

దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆకాశంలో ఒక తార’. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. సాత్విక వీరవల్లి కథా నాయికగా పరిచయమవు తుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈనెల 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ పవన్ సాధినేని మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇది నేను చాలా ఇష్టంగా రాసుకున్న కథ. సినిమా కూడా అంతే అద్భుతంగా వచ్చింది. అల్లు అరవింద్, స్వప్న, సందీప్ గున్నం.. ఇలా ప్రతి ఒక్కరూ సపోర్ట్ గా నిలిచారు. ప్రేక్షకులకు చూపించాలనే ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నాం. సినిమా చూసిన ప్రతి ఒక్కరి మనుసులో నవ్వు కనిపిస్తుంది. ఈ సినిమాను మీ ఫ్యామిలీతో కలిసి చూడండి. పిల్లలు ఉంటే వాళ్లను కూడా తీసుకెళ్లండి. చాలా ఇన్‌స్పైర్ అవుతారు.


అంతేకాదు ప్రేక్ష‍కులు గర్వంగా చెప్పుకునే సినిమా ఇది. ఇది ప్రత్యేకంగా స్త్రీ సాధికారతకు సంబంధించిన సినిమా అయితే కాదు. ఈ సినిమా ద్వారా ఒక మెసేజ్ చెప్పాలని కూడా మా ఉద్దేశం లేదు. సమాజంలో ఉన్నప్పుడు స్త్రీలు, పురుషులు కలిసి జీవిస్తారు. అలాంటి సమాజంలో జరిగే కథే ఇది. ప్రత్యేకంగా స్త్రీల గురించి చెప్పాలనే ఉద్దేశం ఏమీ లేదు. ఒక అమ్మాయి తన కలను సాధించుకోవాలనే ప్రయాణం మొదలుపెట్టినప్పుడు, ఆ ప్రయాణంలో కృష్ణ ఎలాంటి ప్రోత్సాహాన్ని ఇచ్చాడు? ఆమె ప్రయాణం ఎలా ముందుకు సాగింది? అనేది చాలా బ్యూటిఫుల్‌గా ఉండే కథ. ఇది ఒక ఆశను చిగురింపజేసే కథ. ప్రస్తుత సమాజంలో నెగెటివిటీ చాలా ఎక్కువైపోయింది. ఈ సినిమా చూసిన తర్వాత మన జీవితంలో కూడా కృష్ణలాంటి క్యారెక్టర్ ఉంటే ఎంత బాగుంటుందో అనే ఫీలింగ్ ఆడియన్స్‌కు కచ్చితంగా కలుగుతుంది. కృష్ణ పాత్రకు దుల్కర్ 100 శాతం న్యాయం చేశారు. ఆయన ఆ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయారు. సోషల్ మీడియాలో సాత్విక రీల్స్ చూసి, ఎంపిక చేశాం. తను ఆ పాత్రలో చాలా చక్కగా నటించింది. తన పాత్ర అందరికీ బాగా గుర్తుంటుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్