హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం. 1గా శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మైలురాయి’. రఘువర్ధన్ కోట్ల దర్శకత్వం వహిస్తున్నారు. జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర టైటిల్ లాంచ్ పోస్టర్‌ను నటుడు, నిర్మాత, నాగబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,‘ఈ సినిమా టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉంది. నిర్మాత హన్సిక మంచి సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఫిల్మ్ మేకింగ్‌లో మహిళలకు ఉండే బాధ్యత, క్రమశిక్షణ ఎంతో గొప్పవి. ఇప్పటికే అశ్వనీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్, నా కుమార్తె నిహారిక, సుప్రియ యార్లగడ్డ వంటి వారు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హన్సిక కూడా వారి బాటలోనే పయనిస్తూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.
'
మా సినిమా టైటిల్ లాంచ్ పోస్టర్‌ను నాగబాబు చేతుల మీదుగా విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి తెలిపారు.
సహ నిర్మాత తవిటిరాజు తలచింతల మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిస్తున్నాం' అని చెప్పారు.
దేవీ ప్రసాద్, లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి సమర్పణ : డా. శ్రీధర్ పెద్దిరెడ్డి, సినిమాటోగ్రాఫర్ : సాయి వంశీ దాచపల్లి, ఎడిటర్ : ఉదయకిరణ్ ఏవీ, సంగీత దర్శకుడు : రాజీవ్ రాజ్, ఆర్ట్ డైరెక్టర్ : శ్రీపాల్ మాచర్ల.
ఆసక్తికరమైన కథతో ‘మైలురాయి’
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)