దుల్కర్ సల్మాన్ హీరోగా, డైరెక్టర్ పవన్ సాధినేని దర్శకత్వంలో తెర కెక్కుతున్న డిఫరెంట్ ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’.
గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాత్విక వీరవల్లి కథానాయికగా పరిచయమవు తుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే గ్లింప్స్, టీజర్, పోస్టర్లతో ఆసక్తిని పెంచిన మేకర్స్.. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారం భిస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘రాధే రాధే’ సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. రీసెంట్గా ఈ పాటకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్, హీరో దుల్కర్ సల్మాన్ కలిసి ఈ పాటను ఆలపిస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా పాటను రూపొందించిన తీరు, దాని వెనుక ఉన్న భావోద్వేగాలను పంచు కున్నారు. కేవలం పాట మాత్రమే కాకుండా, ‘ఆకాశంలో ఒక తార’ సినిమా వెనుక ఉన్న ఎమోషనల్, సోల్‌ఫుల్ జర్నీని కూడా ఈ వీడియో ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
దుల్కర్ సల్మాన్, జీవీ ప్రకాష్ కలిసి పాట పాడిన తీరు, పాట వెనుక ఉన్న భావోద్వేగాలు ఈ వీడియోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
దీంతో ఈ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే హిట్‌గా నిలిచిన ‘రాధే రాధే’ పాటకు సంబంధించిన ఈ వీడియో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రం ఈనెల 20న తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
‘దుల్కర్ సినిమాలు ఎప్పుడూ భిన్నంగా ఉంటాయి. అలాగే ఆయన పోషించే పాత్రలు సైతం ఎప్పటికప్పుడు చాలా కొత్తగా ఉంటాయి. ఇందులోనూ ఆయన పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఇప్పుటివరకు ఆయన ఈ తరహా క్యారెక్టర్లో కనిపించలేదు. ఈ సినిమా కథను దర్శకుడు పవన్ సాధినేని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఇలాంటి సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది అని మేకర్స్ తెలిపారు.
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, రుహాని శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి దర్శకత్వం: పవన్ సాధినేని, రచన: గంగరాజు గున్నం, నిర్మాతలు: సందీప్ గున్నం, రమ్య గున్నం, సమర్పణ: గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, సంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్, సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, ప్రొడక్షన్ డిజైనర్: శ్వేత సాబు సిరిల్.
ఉద్వేగభరితంగా సాగే ‘ఆకాశంలో ఒక తార’
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది నవం 01, 2026 | 2 నిమిషాల చదవడం





కామెంట్లు (0)