హీరో నాగార్జున సమర్పణలో తెర కెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవు తుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటించారు.
మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవు తుండగా, దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా ప్రేక్షకులకు పరిచయం అవు తున్నారు. ఆయన కొత్తగా ప్రారం భించిన వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో యిన్ అనస్వర రాజన్ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
తెలుగులో నేను ఫస్ట్ సైన్ చేసిన సినిమా ‘ఇట్లు అర్జున’. కాకపోతే ‘ఛాంపియన్’ సినిమా ఫస్ట్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో చేసిన కీర్తి క్యారెక్టర్ చాలా యూత్‌ఫుల్ అండ్ ఇన్నోసెంట్‌గా ఉంటుంది.
ప్రతి అమ్మాయి కీర్తి క్యారెక్టర్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. కథ విన్న ప్పుడు కూడా నేను కీర్తి క్యారెక్టర్‌తో చాలా కనెక్ట్ అయ్యాను.
ఈ క్యారెక్టర్‌ను ప్లే చేయడంలో చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పటి వరకు నేను చేసిన క్యారెక్టర్స్ అన్నిట్లో ఇది చాలా డిఫరెంట్ క్యారెక్టర్. నాకు చాలా కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది.
ఇందులో హీరోకి మాటలు ఉండవు. నాకు కథలో ఆకర్షించిన విషయాల్లో ఇది ఒకటి. ఇలాంటి క్యారెక్టర్స్ చాలా అరుదుగా వస్తుం టాయి. ఈ సినిమా కోసం నేను, అనీష్ కలిసి వర్క్ షాప్స్ చేశాం. సీన్స్ను చాలా ప్రాక్టీస్ చేశాం. మా ఇద్దరి క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చాయి. అయితే ఇందులో మెయిన్ కోర్ ప్రేమకథ. అర్జున్ క్యారెక్టర్‌కు మాటలు రావు. తను ప్రేమను ఎలా ఎక్స్‌ప్రెస్ చేస్తాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.
అర్జున్, కీర్తి పాత్రని కచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు.
ఈ సినిమా చేయడానికి కారణం డైరెక్టర్ మహేష్. ఆయన విజన్ నాకు చాలా నచ్చింది.
హీరోగా అనీష్‌కు ఇది ఫస్ట్ సినిమా. తొలి సినిమాకే ఒక మూగ వాడి పాత్ర చేయడం చాలా డేరింగ్ అండ్ రిస్కీ. ఈ విషయంలో తనని అభినందిస్తున్నాను. కచ్చితంగా ఆడియన్స్ తనని ఇష్టపడతారు. ఇది చాలా కొత్త కథ, ఫ్రెష్ క్యారెక్టర్. ఆ పాత్రకు అనీష్ పూర్తి న్యాయం చేశాడు. తను యాక్షన్, డ్యాన్స్ కూడా అద్భుతంగా చేశాడు.
నాగార్జున ఈ సినిమాని ప్రజెంట్ చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇది నేను తెలుగులో సైన్ చేసిన తొలి సినిమా. అలాగే అనీష్ హీరోగా చేస్తున్న తొలి సినిమా. వెంకీ నిర్మాతగా నిర్మిస్తున్న తొలి సినిమా. నాగార్జున ప్రజెంట్ చేయ డం అనేది మా అందరికీ చాలా మెమొరబుల్. మాకు మరింత నమ్మకాన్ని ఇచ్చింది.
వెంకీ స్వయంగా ఒక దర్శకుడు. ఆయన ప్రతి విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకుంటారు.
తమన్ అందించిన మూడు పాటలకు కూడా చాలా అద్భుత మైన రెస్పాన్స్ వచ్చింది. ఆయన మ్యూజిక్ సినిమాకి మరింత బూస్టప్ ఇచ్చింది.
ప్రతి అమ్మాయి కనెక్ట్ అవుతుంది
45 నిమిషాల క్రితం

balaji
ప్రచురించబడింది నవం 06, 2026 | 2 నిమిషాల చదవడం



కామెంట్‌లు (0)