ఆర్‌కేడీ స్టూడియోస్ నిర్మిస్తున్న ‘మహాకాళి’ చిత్రం నుంచి మేకర్స్ తొలి పాట ‘అయిగిరి నందిని’ని విడుదల చేశారు. అమ్మవారి మహిమను కీర్తించే అత్యంత ప్రసిద్ధమైన, భక్తిశ్రద్ధలతో ఆలపించే ఈ స్తోత్రాన్ని శక్తిమంతమైన సంగీత రూపంలో ఆవిష్కరించారు.
భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వంలో ఎంతో విశిష్టమైన ఆదిశంకరాచార్యుల రచనకు గ్రాండ్ మ్యూజికల్ టచ్ ఇచ్చారు.
అమ్మవారి ఉగ్రశక్తి, దివ్య తేజస్సు, అపారమైన శక్తి సామర్థ్యాలను కీర్తించే ఈ పాట పవర్‌ఫుల్ వోకల్స్, ఆకట్టుకునే సంగీతం, అద్భుతమైన సౌండ్‌స్కేప్‌తో అలరిస్తోంది. తరతరాలుగా భక్తుల హృదయాల్లో నిలిచిన ఈ స్తోత్రానికి సరికొత్త శక్తిని జోడిస్తూ, దైవిక స్త్రీ శక్తికి, మహాకాళి అమ్మవారి మహిమాన్విత రూపానికి అద్భుతమైన నివాళిగా ‘అయిగిరి నందిని’ నిలుస్తోంది.
ఇప్పటికే ‘మహాకాళి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో విడుదలైన అక్షయ్ ఖన్నా పవర్‌ఫుల్ వార్ క్రై టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది.
ఆయన కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
ఆ జోష్‌ను కొనసాగిస్తూ తాజాగా విడుదలైన ‘అయిగిరి నందిని’ పాట సినిమా ప్రపంచంలోని మరో కోణాన్ని పరిచయం చేస్తోంది. గతంలో అక్షయ్ ఖన్నా గ్లింప్స్ ద్వారా సినిమా ఇంటెన్సిటీ చూపించిన మేకర్స్, ఇప్పుడు ఈ పాటతో కథలోని ఆధ్యాత్మిక, భక్తి భావాలను ముందుకు తీసుకొచ్చారు.
మహాకాళి అమ్మవారి దివ్యశక్తిని ప్రధానంగా ఆవిష్కరించారు. స్మరణ్ సాయి స్వరపరిచి, ప్రోగ్రామ్ చేసి, సంగీత రూపకల్పన చేసిన ఈ పాటకు అనిలా రాజీవ్, గీతా మాధురి, సాయి చరణ్ పవర్ ఫుల్ వాయిస్ అందించారు.
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా తెరకెక్కుతున్న ‘మహాకాళి’ భారతీయ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన కథలను భారీ సినిమాటిక్ విజన్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. ఈ యూనివర్స్‌కు పునాది వేసిన ‘హనుమాన్’ సాధించిన విజయాన్ని కొనసాగిస్తూ, ‘మహాకాళి’ మరో ఆసక్తికరమైన ప్రపంచాన్ని పరిచయం చేయనుంది. పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.
‘మహాకాళి’ శక్తికి ప్రతీకగా..
44 నిమిషాల క్రితం
balaji
ప్రచురించబడింది నవం 06, 2026 | 2 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)