Magazines

భరతవాక్యం

53 నిమిషాల క్రితం

Bharatavakyam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

​కుండకు

చిల్లుపడ్డాక

నీళ్లెన్నిపోసినా

ఏం లాభం?
​

ప్రజాస్వామ్యం

నీరుకారాక

ఏ ప్రగతైనా

ఎండమావేగా?

​

​నిట్టాడు ఓటు లేకుండా

సర్కారు గుడిసె నిలుస్తుందా?


భిన్న భాషలు

భిన్న సంస్కృతులు

భిన్న జాతులైతే భిన్న పార్టీలుండవా?

​

​రాజులు రాజరికాలు ఇంకానా?

సర్కారు మారడం దేశద్రోహమా?

​

​సంధించే

సశాస్త్రీయ ప్రశ్నతో

దుష్ప్రచారానికి

చరమాంకం

​

సత్యాగ్రహ

ఉద్యమాచరణే

దుర్మార్గానికి

భరతవాక్యం.

​

​- కె.శాంతారావు,

9959745723

​

​


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్