Magazines

ఎల్లమ్మ టైటిల్‌ సాంగ్‌ కోసం

1 గంట క్రితం

Yellamma
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం

దేశం నలుమూలల నుంచి 100 మంది జానపద రిథమ్ ప్లేయర్లతో 'ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్ రికార్డింగ్ చేస్తున్నారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఈ సినిమాతో ఆయన హీరోగానూ వెండితెరకు పరిచయం అవుతున్నారు. అనౌన్స్‌మెంట్, ఫస్ట్ లుక్ విడుదలైన నాటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్టుకు ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే 100 మంది సంప్రదాయ జానపద రిథమ్ ప్లేయర్లతో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్‌ను రికార్డ్ చేస్తున్నారు. 100 మంది జానపద రిథమ్ ప్లేయర్లు.. ఒక్కటై మోగనున్న శక్తివంతమైన సంగీత హోరు తో ‘ఎల్లమ్మ’ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతోంది. ఈ సంగీత తుఫాన్‌ను ఆస్వాదించేందుకు రెడీగా ఉండండి.. ఈ సాంగ్ త్వరలో విడుదల కానుంది అని మేకర్స్‌ తెలిపారు. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్