నమిత్ మల్హోత్రా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ నుంచి శూర్పణఖ పాత్రలో నటిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. “జనస్థాన్కి రాజకుమారి.. శూర్పణఖ” అంటూ పరిచయం చేసిన ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. బంగారు వర్ణపు ఆభరణాలు, రాయల్ కాస్ట్యూమ్‌తో రకుల్ ప్రీత్ సింగ్ రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఇతిహాసాల్లో ఒకటైన రామాయణాన్ని వెండితెరపై భారీ స్థాయిలో ఆవిష్కరిస్తున్న ఈ చిత్రంలో శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతమ్మగా సాయిపల్లవి, రావణుడిగా రాకింగ్ స్టార్ యశ్, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు.
నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని నమిత్ మల్హోత్రాకు చెందిన ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, ఎనిమిది ఆస్కార్ అవార్డులు అందుకున్న డీఎన్ఈజీ, యశ్‌కు చెందిన మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్‌తో కలిసి నిర్మిస్తోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ ఎపిక్‌లో మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను ఐమ్యాక్స్ ఫార్మాట్లోనూ విడుదల చేయనున్నారు. ఈ చిత్రం ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఎస్వీసీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. భారతదేశం మినహా ప్రపంచవ్యాప్తంగా సోనీ పిక్చర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండగా, హిందీ మార్కెట్లో ధర్మ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపడుతోంది.
శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్
1 గంట క్రితం

balaji
ప్రచురించబడింది అక్టో 30, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్లు (0)