తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కి విశేష ప్రేక్షకా దరణ పొందిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది?’. తాజాగా ఆయన దీనికి సీక్వెల్ ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నలుగురు యువకులు సూట్‌కేసులు, ట్రావెల్ బ్యాగులు, కెమెరా పరికరాలు, ఇతర లగేజీ మధ్య కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరి లుక్, హావభావాలు ప్రత్యేకంగా ఉండటంతో పోస్టర్ ఆసక్తికరంగా, వినోదాత్మకంగా కనిపిస్తోంది. విశ్వక్ సేన్ సన్‌గ్లాసెస్ ధరించి, చేతిలో బ్రౌన్ లెదర్ బ్యాగ్‌తో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. బ్లూ టీ-షర్ట్, కళ్లద్దాలతో ఉన్న వెంకటేష్ కాకుమాను సూట్‌కేసుకు ఆనుకుని ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎడమ వైపు ప్రొఫెషనల్ కెమెరా, ట్రైపాడ్ పట్టుకున్న శ్రీనాథ్ మాగంటి.. ఫిల్మ్ మేకింగ్ లో తన పాత్రకు ఉన్న అనుబంధాన్ని సూచిస్తున్నారు. మధ్యలో గ్రీన్ షర్ట్‌లో ఉన్న అభినవ్ గోమఠం చేతిలో ఓ కాగితం పట్టుకుని ఆశ్చర్యపోయినట్లు కనిపిస్తున్నారు. పాత్రలు, లగేజీతో నిండిన ఈ పోస్టర్ గందరగోళం, కామెడీతో కూడిన కథను సూచిస్తూ ఆసక్తిని పెంచుతోంది. తొలి పార్ట్లో తమ స్నేహం, కామెడీతో యువ ప్రేక్షకులకు దగ్గరైన ఈ నలుగురి గ్యాంగ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా నవంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాకి రచన, దర్శకత్వం: తరుణ్ భాస్కర్, సంగీతం: వివేక్ సాగర్, డీవోపీ: ఏజే ఆరోన్, ఎడిటర్: రవితేజ గిరిజాల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సౌమిత్రి ఎన్, లైన్ ప్రొడ్యూసర్: శ్రీను ఈర్ల.







కామెంట్‌లు (0)