Magazines

హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ విజయం

1 గంట క్రితం

Hyderabad wins
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 13, 2026 | 1 నిమిషాల చదవడం

ఇన్నింగ్స్‌ 40 పరుగులతో త్రిపురపై గెలుపు
ఆరు వికెట్లతో మాయ చేసిన తనయ్‌ త్యాగరాజన్‌


నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఈ ఏడాది రంజీ ట్రోఫీని హైదరాబాద్‌ ఘనంగా ఆరంభించింది. మహ్మద్‌ సిరాజ్‌ సారథ్యంలో తొలి మ్యాచ్‌లో మూడు రోజుల్లోపే విజయాన్ని అందుకున్న హైదరాబాద్‌ అదనంగా ఓ బోనస్‌ పాయింట్‌ను సొంతం చేసుకుంది. 61 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ వెనుకంజతో మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన త్రిపుర ఎంతోసేపు నిలువలేదు. అర గంటలోపే మూడు వికెట్లు చేజార్చుకుని ఇన్నింగ్స్‌ ఓటమి చవిచూసింది. సెంటు సర్కార్‌ (27), పర్వేజ్‌ సుల్తాన్‌ (15), సందీప్‌ సర్కార్‌ (0)లను స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ సాగనంపాడు. దీంతో త్రిపుర రెండో ఇన్నింగ్స్‌లో 41.2 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. హైదరాబాద్‌ స్పిన్నర్‌ తనయ్‌ త్యాగరాజన్‌ (6/52) ఆరు వికెట్లు పడగొట్టి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులు చేయగా, త్రిపుర తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్‌ 40 పరుగుల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్‌ ఏడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. రంజీ ట్రోఫీ రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ఆదివారం నుంచి విజయనగరం వేదికగా ఆంధ్ర, హైదరాబాద్‌ తలపడనున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్