Magazines

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక నిబంధనల్లో సవరణలు

1 గంట క్రితం

Assistant Professor posts
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ర్టఉన్నత విద్యాశాఖ పరిధిలోని 12 విశ్వవిద్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామక నిబంధనలలో ప్రభుత్వం సవరణలు చేసింది. గతంలో జారీ చేసిన జీవో నెం. 21లోని ( మొదటిపేజీ తరువాయి ) నిబంధనలను సవరిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైలెవల్ కమిటీ సిఫారసులు, తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి, కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ల లేఖల ఆధారంగా పరిశీలన జరిపిన ప్రభుత్వం ఈ మేరకు మార్పులను ఆమోదించింది.


​ప్రధాన సవరణలు ఇవీ
గతంలో కేవలం యూజీసీ నిబంధనల వరకే ఉండగా, ఇప్పుడు యూజీసీతో పాటు ఏఐసీటీఈ , పీసీఐ, ఎన్‌సీటీఈ, సీఓఏ, బీసీఐ వంటి ఆయా విభాగాల నియంత్రణ మండళ్ల కనీస అర్హతలను కూడా చేర్చారు. - అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేసే స్క్రూటినీ కమిటీని ఇకపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి పర్యవేక్షణలోనే ఏర్పాటు చేస్తారు. -(ఇంజనీరింగ్ / టెక్నికల్ విభాగాలు): నెట్/సెట్ పరీక్షలు లేని టెక్నికల్ విభాగాలకు గతంలో ప్రతిపాదించిన కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష (100 మార్కుల పరీక్ష) నిబంధనను పూర్తిగా తొలగించారు. దానికి బదులుగా, నెట్/సెట్ లేని అభ్యర్థులకు నెట్ క్యాటగిరికి ఉండే 7 మార్కులు మినహాయించి, మిగిలిన 93 మార్కుల స్కోరునే 100 మార్కుల స్థాయికి లెక్కించి 50 మార్కుల వెయిటేజీకి కుదిస్తారు. పార్ట్-బి లోని 30 మార్కులను డెమో బోధనకు 10 మార్కులు, డొమైన్ నాలెడ్జ్‌కు 10 మార్కులు, రీసెర్చ్ ఆప్టిట్యూడ్‌కు 5 మార్కులు, పుస్తకాల ప్రచురణకు 5 మార్కులుగా విభజిస్తూ పూర్తి స్థాయి మార్కుల వివరాలను నిర్దిష్టంగా పొందుపరిచారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్