Magazines

సరికొత్త కథతో ‘డోంట్‌ స్లీప్‌’

54 నిమిషాల క్రితం

brand-new story
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 14, 2026 | 1 నిమిషాల చదవడం

మలయాళ దర్శకుడు షామ్‌దత్, హీరో ఇంద్ర రామ్ కాంబోలో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’. ‘స్ట్రీట్ లైట్స్’తో దర్శకుడిగా పరిచయమైన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అడుగు పెడుతున్నారు. వీ డ్రీమ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వీ చుడామణి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆ సంస్థకు ప్రొడక్షన్ నెంబర్ 2. నాగచైతన్య, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ కలిసి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. హీరో ఇంద్రరామ్ మాట్లాడుతూ, ‘షామ్ ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. సినిమా చాలా బాగా వచ్చింది. కచ్చితంగా హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం ఉంది. దేవకట్ట కొన్ని డైలాగ్స్ రాశారు. అలాగే ఒక సాంగ్ కూడా రాశారు’ అని తెలిపారు. ‘నేనొక విజువల్ పర్సన్‌ని. నేను తీసిన విజువల్ సినిమాలో ఉంటుంది. అదే మాట్లాడుతుంది. ఇది రెగ్యులర్ సినిమా కాదు. చాలా కొత్త కథ’ అని డైరెక్టర్ షామ్ దత్ చెప్పారు. హీరోయిన్ జోయీతా బెనర్జీ మాట్లాడుతూ, ‘తెలుగులో ఇది నా తొలి సినిమా.అందరికీ ఫస్ట్ సినిమా చాలా స్పెషల్. నిర్మాతలకు ధన్యవాదాలు. ఇంత మంచి టీమ్‌తో కలిసి పని చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. శ్యామ్, అలాగే ఇంద్ర చాలా సపోర్ట్ చేశారు’ అని అన్నారు. ‘కచ్చితంగా ఇది చాలా ఎక్సైటింగ్ ఫిల్మ్ అవుతుంది. ఇందులో చిన్న కామియో కూడా చేశాను’ అని డైరెక్టర్ దేవకట్టా తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్