Magazines

ఇది భారతీయ ప్రజల సినిమా

1 గంట క్రితం

movie
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 07, 2026 | 1 నిమిషాల చదవడం

ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలి బాబా, భక్తులు ప్రేమగా మహారాజ్-జీ అని పిలుచుకునే ఆయన జీవితం, బోధనల స్ఫూర్తితో రూపొందిన సినిమా ‘హనుమాన్ అంశ్’. డాక్టర్ విశాల్ చతుర్వేది రచన, దర్శకత్వంలో తెరకెక్కింది. నీమ్ కరోలి బాబా పాత్రలో శోభినవ్ సత్య నటించారు. హిందీలో విజయవంతమైన థియేట్రికల్ జర్నీ అనంతరం ఇప్పుడు ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. హోంబలే ఫిల్మ్స్ తమ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సౌత్ ఇండియన్ భాషల థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుని.. ఈ చిత్రాన్ని దక్షిణాది ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈనెల 9న తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ నిర్వహించిన మీడియా సమావేశంలో హీరో శోభినవ్ సత్య మాట్లాడుతూ,‘మన భారతీయ సంస్కృతికి చాలా కీలకమైన, ముఖ్యమైన సినిమాని విశాల్ తీశారు. ఆయన వల్లే ఈ సినిమా ఇక్కడ వరకు చేరింది. అలాగే రాగిణి మాకు ఎంతగానో ప్రోత్సహించారు. హనుమంతుల వారి ఆశీర్వాదంతోనే ఈ సినిమా ఇంత గొప్ప విజయాన్ని అందుకుందని నమ్ముతున్నాము. ఇది భారతీయల సినిమా. ప్రజలందరూ తమ సినిమాగా ప్రమోట్ చేశారు. తెలుగులో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ అందుతుందని నమ్మకం ఉంది. ఇది ప్రతి ఒక్కరి మనసులో చేరాల్సిన సినిమా. అందరూ కూడా ఈ సినిమాని చూసి సినిమా గురించి అందరితో పంచుకుంటారని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్