బ్లాక్‌బస్టర్ సక్సెస్ 'కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' తర్వాత హీరో నాని యునానిమస్ ప్రొడక్షన్స్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'అలియాస్ రుక్మిణి' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటిస్తుండగా, 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్న ఈ సినిమా ఒక విలక్షణమైన కథనంతో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో నితిన్ సరసన కథానాయికగా బాలీవుడ్ నటి ఆఫియా సయ్యద్‌ను మేకర్స్ అధికారి కంగా పరిచయం చేశారు. ఈ గ్లింప్స్‌లో రుక్మిణి ఓ స్కూల్ టీచర్‌గా కనిపిస్తుంది. ఆమెను విద్యార్థులు ‘డెవిల్’, ‘హిట్లర్’, ‘హోంవర్క్ పోలీస్’ వంటి పేర్లతో పిలుచుకుంటుంటారు. కోపంగా బోర్డుపై తన పేరు రాస్తూ, ఆ తర్వాత విద్యార్థుల వైపు ఇంటెన్స్ గా చూసే రుక్మిణి పాత్రను ఈ గ్లింప్స్ పరిచయం చేస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. దానికి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. ప్రేమకథా అంశాలతో పాటు ఆసక్తికరమైన ప్రధాన సంఘర్షణతో కూడిన కథలో నితిన్‌ను సరికొత్త అవతార్‌లో చూపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు కూడా మంచి స్పందన వచ్చింది అని మేకర్స్ తెలిపారు.







కామెంట్‌లు (0)