Magazines

‘ఎల్లమ్మ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

1 గంట క్రితం

‘Yellamma’ release date fixed
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఎల్లమ్మ’. వేణు యెల్దండి దర్శకత్వం వహిస్తు న్నారు. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ చిత్రం రూపొందు తోంది. సాంస్కృతిక సంప్రదాయాల నేపథ్యంలో భావోద్వేగాలతో కూడిన కథగా ‘ఎల్లమ్మ’ను తీర్చిదిద్దుతున్నారు. దసరా పర్వదినం సందర్భంగా మేకర్స్ ఈ సినిమా వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను 2027 మార్చి 5గా ప్రకటించారు. ‘ఎల్లమ్మ’ దేవిశ్రీ ప్రసాద్ కెరీర్‌లో ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది. ఇన్నాళ్లూ సంగీత దర్శ కుడిగా ప్రేక్షకులను అలరించిన ఆయన, ఈ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేయడంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగు తోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది అని మేకర్స్‌ చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్