Magazines

గర్వంగా చెప్పుకుంటారు

17 నిమిషాల క్రితం

pride
avatar
balaji

ప్రచురించబడింది నవం 26, 2026 | 1 నిమిషాల చదవడం

హీరో నాగ చైతన్య మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వంలో ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తుండగా, బాపినీడు ఈ సినిమాను సమర్పిస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను నెల్లూరులో రిలీజ్ చేశారు. హీరో నాగ చైతన్య మాట్లాడుతూ, ‘ట్రైలర్ మీ అందరికీ నచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా కథ కార్తీక్ చెప్పినప్పుడు నిజానికి ఆ కథకు ఎలాంటి రిఫరెన్స్ లేదు. అంత ఒరిజినల్‌గా రాశారు. చాలా ఫ్రెష్ ఐడియా. ఎప్పుడూ చూడని విజువల్స్ ఇందులో ఉన్నాయి.

మేము ఇంతకాలం దేని కోసమైతే కష్టపడ్డామో ఆ విజువల్స్ అన్నీ మీకు ట్రైలర్‌లో కనిపించాయి. సినిమా రెండు గంటల 50 నిమిషాలు ఉంటే, దాదాపు ప్రతి ఫ్రేమ్‌లో ఏదో ఒక వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఉంటుంది. కొత్త కొత్త విషయాలు ఉంటాయి. అలాంటి అద్భుతమైన విజన్‌ను డైరెక్టర్ కార్తీక్ తీసుకొచ్చారు. ఈ సినిమాకు ఫస్ట్ హీరో నా డైరెక్టర్ కార్తీకే. మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతోమంది గొప్ప డైరెక్టర్లు వచ్చి ఇండియా అంతటా తమ సత్తా చాటారు. ఆ లిస్టులో కార్తీక్ కూడా చేరబోతున్నారు. ఇక మా నిర్మాత బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఎక్కడా రాజీపడలేదు. ఆయనే మా ధైర్యం. తెలుగు సినిమా గర్వంగా చెప్పుకునేలా ఈ సినిమా ఉంటుందిది. మీ అందరినీ తప్పకుండా అలరి స్తామని నమ్ముతున్నాను’ అని చెప్పారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్