Magazines

మూస చిత్రాలకు భిన్నంగా..

3 గంటల క్రితం

stereotypical
avatar
balaji

ప్రచురించబడింది నవం 19, 2026 | 2 నిమిషాల చదవడం

"బట్టల రామస్వామి బయోపిక్కు" సినిమా ద్వారా తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో అల్తాఫ్ హసన్. ఆయన హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తూ 'రాజిగాడు రాజయ్యాడు' అనే కొత్త చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాను శర్మాస్ ఫిలింస్ బ్యానర్ పై బత్తుల పర్విన్, మనోజ్ అర్రోల, చిన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అను శ్రీ హీరోయిన్ గా నటిస్తుండగా, ప్రముఖ కవి, గాయకుడు డా. గోరటి వెంకన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. గురువారం ఈ సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. నిర్మాత చిన్ని మాట్లాడుతూ,'సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి కంప్లీట్ అయ్యేవరకు జరిగే జర్నీ నేను చూశాను. దాంతో నాకు సినిమాల మీద గౌరవం మరింత పెరిగింది. మా టీమ్ లోని ప్రతి ఒక్కరి సపోర్ట్ వల్లే అడ్డంకులు దాటుకుని ఇక్కడిదాకా వచ్చాం. సినిమా బాగా వచ్చింది. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని అన్నారు. 'మా ప్రొడ్యూసర్ చిన్ని వల్లే మా అందరి కల నిజమవుతోంది.

విజయ్ భాస్కర్ రాసిన నాటకం ఈ సినిమాకు మూలం. పల్లె కన్నీరు పెడుతుందో అనే గొప్ప పాట రాసిన గోరటి ఈ సినిమాకు అలాంటి పాట రాయగలరని ఆయనను అప్రోచ్ అయ్యాం. మా నాన్న పాత్ర కూడా ఆయనే చేయాలని కోరాం. జగదీశ్ ఏడు ఆణిముత్యాల్లాంటి పాటలు అందించారు. ఆ పాటలు మా సినిమాకు సోల్ లా మారాయి. మా డీవోపీ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. గొప్ప పర్పస్ ఉన్న ఇన్స్ పైరింగ్ మూవీ ఇది' అని హీరో, డైరెక్టర్ అల్తాఫ్ హసన్ చెప్పారు. గీత రచయిత, నటుడు డా.గోరటి వెంకన్న మాట్లాడుతూ,'నేను ఈ సినిమాను మూడు సార్లు చూశా. ఎప్పుడూ బోర్ రాలేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో ఉంటాయి. మూస చిత్రాలు భిన్నంగా అల్తాఫ్ ఒక చరిత్ర సృష్టించబోతున్నాడు. ఈ సినిమాలో నేనొక మంచి క్యారెక్టర్ కూడా చేశాను. ఈ సినిమా రాజకీయ నేపథ్యంతో రావడం లేదు. ఒక జీవితాన్ని చూసిన ఫీల్ కలిగిస్తుంది. ఏ ప్రాంతం నేపథ్యంతో వస్తున్న కథైనా మనకు హార్ట్ టచింగ్ గా ఉండాలి. మనసును తాకే ఆ తరహా కథతో వస్తున్న ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలి' అని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్