నవతెలంగాణ – మిర్యాలగూడ
ప్రత్యేక విస్తృత ఓటర్ జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్)లో భాగంగా మ్యాపింగ్ పనులను వేగవంతం చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఎం. నారాయణ్ అమిత్ కోరారు. సోమవారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టరేట్ ఓపెన్ కాన్ఫరన్స్ హాలులో మ్యాపింగ్ చేస్తున్న బూత్ లెవెల్ ఆఫీసర్లైనా అంగన్వాడీ టీచర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. మిర్యాలగూడ పట్టణం, మండలంలో 62 శాతం మాత్రమే జరిగిందని వేగంగా వంద శాతానికి చేరుకోవాలని ఆయన కోరారు. అవగాహనతో టీం లీడర్ ను సంప్రదిస్తూ అనుమానాలు నివృత్తి చేసుకుంటూ దృష్టి కేంద్రికరించి పని చేయాలని ఆయన కోరారు. ఆయన వెంట సబ్ కలెక్టరేట్ పరిపాలన అధికారి శ్రీనివాస్ శర్మ, డిప్యూటీ తహసీల్దార్ (ఎన్నికలు)ప్రవీణ్ కుమార్, గణాంక అధికారి రవీందర్ రెడ్డి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ టి.రామకృష్ణ ఉన్నారు.
ఎస్ఐఆర్ మ్యాపింగ్ పనులను వేగవంతం చేయాలి: సబ్ కలెక్టర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



