Thursday, January 8, 2026
E-PAPER
Homeఆటలుమహ్మద్‌ షమికి 'సర్‌' నోటీసు

మహ్మద్‌ షమికి ‘సర్‌’ నోటీసు

- Advertisement -

కోల్‌కతా : భారత క్రికెటర్‌, స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమికి పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కమిషన్‌ అధికారులు ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషనల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) నోటీసులు జారీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన మహ్మద్‌ షమి ప్రొఫెషనల్‌ క్రికెట్‌ కెరీర్‌ నిమిత్తం కొన్నేండ్ల క్రితం పశ్చిమ బెంగాల్‌కు మారాడు. కోల్‌కతాలోని జాదవ్‌పూర్‌ నియోజకవర్గంలో మహ్మద్‌ షమి ఓటర్‌గా నమోదయ్యారు. ఇటీవల పలు ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోనే షమి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్‌ విచారణలో భాగంగా మహ్మద్‌ షమితో పాటు అతడి సోదరుడు మహ్మద్‌ కైఫ్‌కు ఎన్నికల కమిషన్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సోమవారం షమి విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. రాజ్‌కోట్‌లో విజరు హజారే ట్రోఫీలో బెంగాల్‌ ప్రాతినిథ్యం వహిస్తున్న షమి హాజరు కాలేకపోయాడు. దీంతో షమి విచారణకు మరో తేదిని నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. ఐసీసీ ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచిన మహ్మద్‌ షమి.. 2025 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత జాతీయ జట్టుకు దూరమయ్యాడు. దేశవాళీ ట్రోఫీలో రాణిస్తున్నా.. ఇటు టెస్టుల్లో, అటు వన్డే, టీ20 జట్లలో షమికి చోటు దక్కటం లేదు. గత సీజన్‌ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన షమి.. ఈ సీజన్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మారిని సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -