Monday, February 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంసర్‌ను పకడ్బందీగా అమలు చేయాలి

సర్‌ను పకడ్బందీగా అమలు చేయాలి

- Advertisement -

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి
ఏఈఆర్‌ఓలకు ఒక రోజు శిక్షణ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌)ను పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి. సుదర్శన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని సీఈవో కార్యాలయం నుంచి మెదక్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల సహాయ ఎన్నికల నమోదుపై 195 మంది అధికారులకు (సర్‌) ఆన్‌లైన్‌ శిక్షణ నిర్వహించారు. ఓటరు జాబితాల తయారీ, నవీకరణ, నిర్వహణ అంశాలపై విపులంగా అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాల్లో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం, వివరాల సవరణ వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. రాబోయే సర్‌ను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన సన్నాహకాలను సమయానికి పూర్తి చేయాలని సుదర్శన్‌ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితాల స్వచ్ఛతను కాపాడటంలో సర్‌ పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు దోహదం చేస్తాయని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -