కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో నదియా జిల్లాలో సర్ ప్రక్రియ వివాదానికి దారితీసింది. బూత్ లెవల్ ఆఫీసర్ (బిఎల్‌ఒ) అలీ సాహెబ్‌పై గ్రామస్తులు దాడికి దిగినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. కాలిగంజ్ ప్రాంతంలోని గ్రామంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అయాతుల్లా షేక్, ఆమె భార్య అలీఫా బీబీ కుటుంబం సమర్పించిన పత్రాల్లో లోపాల సవరణ కోసం ప్రత్యేక విచారణకు హాజరుకావాలని తెలుపగా ఆయనపై దాడి జరిగిందని అన్నారు.
కుమార్తె మరియు షేక్ మధ్య వయస్సులో వ్యత్యాసం ఉన్నందున విచారణకు హాజరుకావాలని అలీఫా బీబీకి తెలిపిన తర్వాత తనపై కర్రతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే షేక్ ఈ అభియోగాన్ని తోసిపుచ్చారు. బిఎల్‌ఒ తమ కుటుంబంపై వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంటూ, ఆయనపై కౌంటర్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఘటన మరోసారి ఎస్‌ఐఆర్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో ఎన్నికల అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలను వెల్లడించింది. ఫిబ్రవరి 28న తుది ఓటరు జాబితా ప్రచురితం కానున్న సంగతి తెలిసిందే.
పశ్చిమబెంగాల్‌లో వివాదానికి దారితీసిన ‘సర్’
- Advertisement -
- Advertisement -



