Sunday, January 11, 2026
E-PAPER
Homeజిల్లాలుStudent Concern : సార్‌… మీరు వెళ్లొద్దు …

Student Concern : సార్‌… మీరు వెళ్లొద్దు …

- Advertisement -

నవతెలంగాణ మనూర్‌: సంగారెడ్డి జిల్లా మనూర్‌ మండలం ముక్టపూర్‌లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు మా ఉపాధ్యాయుడు మాకే కావాలంటూ ఆందోళన చేపట్టారు. బదిలీ పై వెళ్తున్న నాగల్ గిద్ద మండలం ముక్టపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు రమేశ్‌ని వెళ్లొద్దంటూ విద్యార్థులు, గ్రామస్థులు రోడ్డుపై బైటాయించి నిరసన చేశారు. టీచర్‌ రమేశ్‌ బదిలీని రద్దు చేయాలంటూ వారు డిమాండ్‌ చేశారు. విద్యా బుద్దులు నేర్పిన తమ గురువు బదిలీపై వెళ్తుంటే.. ‘సార్‌… మీరు వెళ్ళవద్దు` అంటూ బాలబాలికలు చూపిన అభిమానం చూసేవారిని కంటతడి పెట్టించింది. గురు శిష్యులు బంధాన్ని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు సైతం విలపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -