నవతెలంగాణ – చారకొండ
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో కనిపించిన చంద్ర గ్రహణం ముగిసింది. భారత్ లో కూడా అర్ధరాత్రి 2 గంటల 25 నిమిషాలు దాటాక పూర్తి గ్రహం వీడింది. అనంతరం సోమవారం తెల్లవారుజాము నుంచి తెలుగు రాష్ట్రాలలో ఆలయాలు తెరుచుకున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలోని చారకొండ మండల పరిధిలోని రెండో అపర భద్రాద్రిగా పేరుగాంచిన శిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం పున ప్రారంభించారు. సుమారు 18 గంటల అనంతరం ఆలయం ప్రధాన ద్వారం తెరిచారు. గ్రహణం వీడటంతో ఆలయ శుద్ధి, మహాగణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగ్రవ్య ప్రాసన, దేవాలయ సంప్రోక్షణ, మూలవిరాట్ కు పంచాం పంచామృతాభిషేకం, తులసీనామర్చన చేశారు అర్చకులు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రాము శర్మ మాట్లాడుతూ…. తెల్లవారుజామున పూజల అనంతరం ఉదయం 7 గంటల నుండి యధావిధిగా పూజా కార్యక్రమాలు, భక్తుల దర్శనాలు ప్రారంభించామని తెలిపారు.
శిరసనగండ్ల శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం పున: ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES