– భరించలేని దుర్వాసన
– అనారోగ్యానికి గురవుతున్న చుట్టుపక్కల ప్రజలు
– పట్టించుకోని మున్సిపల్ అధికారులు – బస్ డిపో మేనేజర్
– వెంటనే బస్ డిపో ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ సాధన చేసుకొవాలి
– ఇతర ప్రజా అవసరాలకు ఉపయోగించాలి
– సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి ముశం రమేష్
నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఖాళీగా ఉన్న స్థలంలో చెత్తాచెదారం, జంతువుల శవాలతో నిండి పోయిందని,పెద్ద ఎత్తున దుర్వాసన వెదజల్లుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి రమేష్ అన్నారు. ప్రజలు బస్టాండ్లో నిలబడాలంటే వాసనకు నిలబడలేదు పరిస్థితి తలెత్తినది చెత్తాచెదారం వలన దోమలు ఈగలు పెద్ద ఎత్తున తయారై చుట్టుపక్కల నివసించే ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. బస్టాండ్ ఖాళీ స్థలంలో అంత ఘోరంగా చెత్తాచెదారం చేస్తుంటే బస్ డిపో మేనేజర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఒకపక్క ప్రజలు విష జ్వరాలతో బాధపడుతుంటే పట్టణ నడిబొడ్డున ఇంత దారుణంగా ఉంటే ప్రజల ఆరోగ్యాల పరిస్థితి ఎలా బాగుపడుతుంది? ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే వెంటనే బస్ డిపో ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ స్వాధీనం చేసుకుని ఇతర ప్రజా అవసరాలకు ఉపయోగించాలని ఖాళీగా ఉంటే ఇదే రకంగా మొత్తం డంపింగ్ యార్డ్ గానే కొనసాగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు నక్క దేవదాసు పాల్గొన్నారు.