Wednesday, October 22, 2025
E-PAPER
Homeకరీంనగర్సిరిసిల్లకు 'జ్వరం'

సిరిసిల్లకు ‘జ్వరం’

- Advertisement -

సిరిసిల్లలో పెరుగుతున్న జ్వర పీడితుల సంఖ్య
జ్వరాలతో కిటకిటలాడుతున్న ప్రయివేటు ఆస్పత్రులు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

సిరిసిల్లలో రోజురోజుకు జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలే కాకుండా ప్రయివేటు ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. డెంగ్యూ జ్వరాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రతిరోజు వందల సంఖ్య లో జ్వరం పీడితులు వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి అలాగే మండలాల్లో కూడా ఆసుపత్రులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది లేకపోవడం మందులు అంతంతమాత్రంగానే ఉన్నట్లు తెలుస్తుంది.

ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలు అంతంత మాత్రమే అందుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రికి ప్రతిరోజు 900 నుంచి 1000 మంది వరకు ఓపి ఉంటుండగా 300 మంది వరకు ఇన్ పేషెంట్లు వస్తున్నారు. ఆసుపత్రిలో ఇంజక్షన్లు ఐ వి సెట్లు పూర్తిస్థాయిలో కనిపించడం లేదు ప్రతి ఏడాది సుమారు1.30 కోట్ల మందులు వస్తుండగా జిల్లా ఆసుపత్రిలో అవి సరిపోవడం లేదు. అంతేకాకుండా ఆసుపత్రిలో మంచాలు కూడా సరిపడా లేవు జ్వరాలతో చిన్నారులు అధికంగా వస్తున్నారు

ప్రయివేట్ ఆస్పత్రులకు డెంగ్యూ వరం…
జ్వరంతో బాధపడుతూ రక్త కణాలు తగ్గాయంటే చాలు డెంగ్యూ వచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రులు అమాయక ప్రజల వద్ద దోచుకుంటున్నారని రోగులు పేర్కొంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సుమారు 50 వరకు ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఒక్క ఆసుపత్రిలో సుమారు వంద నుంచి 200 మంది రోగులకు ప్రతిరోజు పరీక్షలు చేస్తున్నారు. పరీక్ష ఫీజు కింద ఒక్కరికి 200 చొప్పున వసూలు చేస్తున్నారు. మందుల పేరిట ప్రతిరోజు జిల్లాలోని కోటి వరకు ఆసుపత్రులకు ముట్ట చెబుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు లేకపోయినప్పటికీ రోగులనుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. రోగుల పరిస్థితి విషమంగా మారితే ఇతర ప్రాంతాలకు పంపిస్తుండగా ప్రాణాలు మధ్యలోనే పోతున్నాయి. జిల్లాలోని కోనరావుపేట ఇల్లంతకుంట ఎల్లారెడ్డిపేట బోయినపల్లి రుద్రంగి చందుర్తి తంగళ్ళపల్లి ముస్తాబాద్ వీర్నపల్లి మండలాల్లో జ్వర పీడితులు పెరిగి డెంగ్యూ బారిన పడుతున్నారు

అపరిశుభ్రతే అనారోగ్యాలకు కారణమా…
గ్రామాల్లో డెంగ్యూ విష జ్వరాలు చికెన్ గున్యా మలేరియా వంటి వ్యాధులు పెరుగుతున్నప్పటికీ పరిశుభ్రత మాత్రం కనిపించడం లేదు పారిశుద్ధ్యం అధ్వానంగా మారినా సంబంధిత అధికారులు దృష్టి సారించడం లేదు గ్రామాల్లోని మురుగు కాలువల్లో చెత్తతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి అధికారులు గ్రామాల పరిశుభ్రతపై అసలు దృష్టి సారించడం లేదనే కనిపిస్తుంది ప్రస్తుతం ఓవైపు ప్రజలు డెంగ్యూ విషజ్వరాల బారిన పడుతుండగా అధికారులు మాత్రం అటువైపు దృష్టి సారించక ప్రజాప్రతినిధుల మన్ననలు పొందడానికి వారి చుట్టూ తిరుగుతున్నారు.

ప్రజా ప్రతినిధులు కూడా పట్టణాలు గ్రామాల్లో ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా పైన పటారం లోన లొటారం అన్నట్లు పైపై పర్యటనలు చేస్తున్నట్లు కనిపిస్తుంది ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తేరుకుని గ్రామాలు పట్టణాల పరిశుద్ధంపై దృష్టి సారిస్తే అధికారులు కొంత పనుల్లో పడే అవకాశం కనిపిస్తుంది వారు పనుల్లో పడితే గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా మారే అవకాశం ఉంది గ్రామాలు పట్టణాలు పరిశుభ్రంగా ఉంటే డెంగ్యూ విష జ్వరాలు రాకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండే అవకాశం కనిపిస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -