నవతెలంగాణ-మోపాల్
మోపాల్ మండలం సిర్పూర్ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ప్రముఖ కవి, డాక్టర్ కాసర్ల నరేష్ రావుకు యు.వి.ఫౌండేషన్ వారి సేవా భారతి 2025 పురస్కారం శుక్రవారం నిజామాబాద్ పోలిస్ కమిషనర్ సాయి చైతన్య చేతుల మీదుగా అందుకున్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు ప్రముఖ సంఘ సేవకులు యువరాజ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు సంస్థ నిర్వాహకులు సుజన్ తెలిపారు. సిరిపూర్, గుండారం పాఠశాలల్లో విద్యా బోధనతో పాటుగా అనేక సామాజిక సేవా సంస్థలతో అనుబంధం కలిగి ఉండి వారిచేత పాఠశాలకు ఎన్నో నిధులను తీసుకువస్తూ సామాజిక సేవలో మునుముందుకు సాగుతున్న క్రమంలో వారికి ఈ అవార్డు లభించింది.
అంతే కాకుండా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థలో గౌరవ సభ్యులుగా కొనసాగుతూ నిరంతరం సామాజిక సేవలో కాసర్ల మునుముందున ఉన్నారు. సేవా భారతి పురస్కారాన్ని అందుకున్న డా.కాసర్లను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. సత్యనారాయణ మరియు ఉపాధ్యాయులు శ్యామల, మోహన్, అక్బర్ బాషా, వందన, డాక్టర్ హజారె శ్రీనివాస్, టిటియు జిల్లా అధ్యక్షులు లాటికర్ రాము అభినందనలు తెలియజేసారు.



