హర్షం వ్యక్తం చేసిన స్థానికులు
నవతెలంగాణ – చందుర్తి
ఆధునిక భాషా చరిత్ర ఆధునిక సాహిత్యం ఒకరు, జానపద విజ్ఞానం అంశంలో మరొకరు నాల్గు బంగారు పథకాలు ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు సాధించారు. మండలంలోని లింగంపేటకు చెందిన కదాసు సుగుణ-లింబాద్రి కూతుర్లు నర్మదా 2020-2022 సంవత్సరంలో అగ్రహారం కాలేజీలో ఎం. ఏ పూర్తి చేసి ఆధునిక కవిత బాషా చరిత్రపై అత్యధిక మార్కులు సాధించింది. చిన్న కూతురు నీరజ జానపద విజ్ఞాన అంశంలో అత్యధిక మార్కులు సాధించగా శుక్రవారం కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో గవర్నర్ జిస్టు దేవా వర్మ చేతుల మీదుగా బంగారు పతకాలను అందుకున్నారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెల్లు తెలుగు సాహిత్యంలో పట్టు సాధించినందుకు పలువురు వారిని అభినందించారు.




