నవతెలంగాణ హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ సిట్ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఏ-4 నిందితుడిగా ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుతో కలిపి కేటీఆర్‌ను సీట్ అధికారులు విచారిస్తున్నారు. వివిధ అంశాలపై వీరిద్దరినీ ప్రశ్నిస్తున్నారు.
రాధాకిషన్‌రావు గతంలోనూ సిట్ విచారణకు హాజరయ్యారు. పలు కీలక విషయాలను అప్పట్లో ఆయన వెల్లడించారు. 2023 ఎన్నికల సమయంలో కొందరు నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు చెప్పారు. బీఆర్‌ఎస్ వ్యతిరేకుల ఫోన్లపై నిఘా పెట్టినట్టు ఆయన గతంలోనే తెలిపారు. ఈ నేపథ్యంలో కేటీఆర్, రాధాకిషన్‌రావును కలిపి సిట్ అధికారులు విచారిస్తున్నారు. రాధాకిషన్‌రావు చెప్పిన అంశాలపై సమాచారముందా? అని కేటీఆర్‌ను ప్రశ్నించినట్టు సమాచారం.



