Monday, October 6, 2025
E-PAPER
Homeసినిమాయూనిక్‌ కథతో 'సీతా పయనం'

యూనిక్‌ కథతో ‘సీతా పయనం’

- Advertisement -

అర్జున్‌ సర్జా దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్‌ ప్రాజెక్ట్‌ ‘సీతా పయనం’. శ్రీరామ్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య అర్జున్‌, నిరంజన్‌ లీడ్‌ రోల్స్‌ పోషిస్తున్నారు. అర్జున్‌, ధ్రువ సర్జా పవర్‌ ఫుల్‌ పాత్రల్లో కనిపించనున్నారు.
సోమవారం ధ్రువ సర్జా బర్త్‌ డే సందర్భంగా మేకర్స్‌ ఆయన ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు. ధ్రువ సర్జాని యాక్షన్‌ హల్క్‌గా ప్రజెంట్‌ చేసిన ఫస్ట్‌లుక్‌ అందరినీ అలరిస్తోంది.
‘ఇప్పటికే విడుదలైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. పాటలు చార్ట్‌ బస్టర్‌ హిట్‌ అయ్యాయి. సినిమా సైతం అందర్నీ మెస్మరైజ్‌ చేస్తుంది. ఓ యూనిక్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.
ఐశ్వర్య అర్జున్‌, నిరంజన్‌, సత్యరాజ్‌, ప్రకాష్‌ రాజ్‌, కోవై సరళ, అర్జున్‌, ధ్రువ సర్జా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే, నిర్మాత, దర్శకత్వం: అర్జున్‌ సర్జా, సంగీతం: అనుప్‌ రూబెన్స్‌,
డిఓపి: జి బాలమురుగన్‌, ఎడిటర్‌: అయూబ్‌ ఖాన్‌, డైలాగ్స్‌: సాయి మాధవ్‌ బుర్రా, సాహిత్యం: చంద్ర బోస్‌, కాసర్ల శ్యామ్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -