బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడు
నవతెలంగాణ- నెల్లికుదురు
మండలంలోని వివిధ గ్రామాలలో శ్రీ సీతారాముల కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఈ సందర్భంగా మండల కేంద్రంతో పాటు బ్రాహ్మణ కొత్తపల్లి నైనాల మదనతోర్తి సీతారాంపురం పార్వతమ్మ గూడెం ఆలేరు గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించడం ఆ గ్రామ సర్పంచులు చిర్రా యాకాంతం గౌడ్, యాసం సంధ్య, ధారావత్ భాస్కర్ ఏదేళ్ల పూలమ్మ నాయిని పద్మ తెలిపారు.
బ్రాహ్మణ కొత్తపెళ్లి గ్రామం లో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పాలకమండలి సమక్షంలో శ్రీ సంతాన వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుడు శ్రీ బూరుగడ్డ సంపత్ కుమార్ ఆచార్యులు వచ్చి ఘనంగా నిర్వహించారు. ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్, ఉప సర్పంచ్ పిట్టల ఉప్పలయ్య తెలిపారు. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలకు నూతన పట్టు వస్త్రాలను తీసుకువచ్చి చూస్తే మెట్టెలు బ్యాండ్ మేళం మధ్యలో ఘనంగా నిర్వహిస్తూ ఈ యొక్క కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు తాజా మాజీ ప్రతినిధులు పాల్గొన్నారు.



